భూగర్భ జలాల రక్షణకు ఎపి సర్కార్‌ ప్రాధాన్యం

 

వాననీటిని ఒడిసిపట్టేలా కార్యక్రమాలు

ఫలితం ఇస్తున్న సంరక్షణ చర్యలు

అమరావతి,సెప్టెంబర్‌22(జ‌నంసాక్షి ): భూగర్భ జలాలలను పెంచేలా శాశ్వత చర్యలకు ఎపి సర్కార్‌ కసరత్తు చేస్తోంది. నదుల అనుసంధానం,చెరువుల పునరుద్దరణ,ఇంకుడు గుంతలకు ప్రాధాన్యం ఇస్తోంది. ప్రభుత్వం ఆయా ప్రాంతాలను బట్టి అందుబాటులో ఉన్న వనరులను బట్టి వారికి అందుబాటులోకి వచ్చింది. నీరుచెట్టు వంటి కార్యక్రమాలు, చెరువుల పునరుద్దరణ వంటి కార్యక్రమాలతో భూగర్భజలాలను అందుబాటు లో ఉంచాలని చూస్తోంది. దీని వల్ల రాష్ట్రంలో వర్షాభావ పరిస్ధితుల నుంచి బయటపడాలని చూస్తోంది. ఇలా ఈ నీటిని ఉపయోగించి పంటలను కాపాడే అవకాశం లభిస్తుందని ప్రభుత్వ ఆలోచనగా ఉంది. దీని కోసం రాష్ట్రంలో ప్రజలందరు కూడా ఇంకుడు గుంతలు తవ్వడం వల్ల భూగర్భ జలమట్టాన్ని పెంచడానికి అవకాశం ఉన్నట్లు ప్రచారం చేపట్టింది. వర్షం రూపంలో పడే ప్రతి చుక్కను కాపాడి రైతులకు అందించాలనే సంకల్పంతో కృష్ణానదిని పెన్నానదితో అనుసంధానం కూడా చేయాలని ఆలోచిస్తుంది. దీని వల్ల రాష్ట్రంలో నదుల అనుసంధానం పూర్తిగా జరిగి కరువు రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రపంచ పటంలో నిలిచే అవకాశం ఉంది. దీనికోసం బాబువేస్తున్న ప్రణాళికలు కార్యరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయి. అవి అమలయితే రాష్ట్రంలో భూగర్భ జలాలలకు కొదవ ఉండదు. ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా

వ్యవసాయానికి అవసరమైన స్పింక్లర్లు, రెయిన్‌గన్స్‌ ఉపయోగించడం ద్వారా ప్రభుత్వం వేల ఎకరాల్లో పంటను కాపాడగలిగింది. తాజా వర్షాలకు పంటలు నిలదొక్కకున్నాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికే కరువు విూద యుద్ధం ప్రకటించి రైతులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను యుద్ధప్రాతిపదిక విూద అందిస్తుంది. రాయలసీమలో సకాలంలో వర్షాలు పడకపోవడం వల్ల

లక్షల ఎకరాలలో వేరుశెనగ పంట నీళ్ళు లేక ఎండిపోయే పరిస్ధితులలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ ప్రాంతంలో రెయిన్‌గన్స్‌ వినియోగంతో రైతులకు అండగా నిలిచారు. దానితో ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలతో వారికి ప్రభుత్వం విూద ఒక నమ్మకంతో పాటు భరోసా కూడా ఎర్పడింది. అదే విధంగా వివిధ ప్రాజెక్టులలో కూడా అనుకున్నంతగా నీరు లభ్యం కాకపోవడం కూడా ప్రతికూల పరిస్ధితులు ఏర్పడడానికి అవకాశం కలిగింది. అయినా ప్రభుత్వం గోదావరికృష్ణా నదుల అనుసంధానంతో పట్టిసీమ నిర్మించి ఈ విపత్కర పరిస్ధితుల నుంచి రైతులను కాపాడడమే కాక పంటలను కూడా రక్షించడంతో డెల్టా రైతులు ఊపిరి పీల్చుకున్నారు. సకాలంలో రైతులు నాట్లు వేసుకునే విధంగా తోడ్పాటు అందించడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఎకరాలలో రైతులు వివిధ పంటలను వేయడం జరిగింది. ప్రభుత్వం విూద భరోసాతో నీళ్ళు సకాలంలో వర్షాలు పడకపోయినా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీళ్ళు పంట పోలాలకు అందిస్తుందన ఉద్ధేశ్యంతో ముందుకు వేళ్ళడం జరిగింది. ప్రభుత్వం కూడా పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణాడెల్టాకు 16 టి.ఎం.సీల దాకా నీరు అందించడం జరిగింది. ఈ వెసులబాటుతో రాయలసీమకి హంద్రీనీవా, గాలేరునగరి ద్వారా కృష్ణానది నుంచి అక్కడకి మళ్ళించడం జరిగింది. పోతిరెడ్డిపాడు ద్వారా శ్రీశైలం నుంచి నీరు సీమకు విడుదల చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలలో భాగంగా రైతాంగానికి ఒక భరోసా ఎర్పడి ముందుక వెళ్ళడం జరిగింది. అనుకున్న దానికంటె తక్కువ వర్షపాతం రాష్ట్రంలో కురిసింది. దీంతో రైతులు ఎక్కువ గా భూగర్భజలాల విూద ఆధారపడి మోటర్ల ద్వారా ఎండిపోతున్న తమ పంటలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

తాజావార్తలు