భూములు కోల్పోయిన కుటుంబాలకు ఉపాధి :కేటీఆర్

ఝరాసంగం జూన్ 22 (జనంసాక్షి )నిమ్జ్ లో  భూములు కోల్పోయిన రైతుల కుటుంబాలకు  ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఝరా సంగం మండల పరిధిలోని చిలేపల్లి గ్రామ శివారులో బుధవారం తొలి పరిశ్రమ వెమ్ ప్రాజెక్ట్  నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా  మంత్రి కేటీఆర్  మాట్లాడుతూ వెమ్ టెక్నాలజీస్ రాష్ట్రానికి రావడం సంతోషంగా ఉందని, పరిశ్రమ ఏర్పాటుతో రెండు వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. పరిశ్రమలు పర్యావరణ హితంగా ఉండాలని పేర్కొన్నారు. భూములు కోల్పోయిన రైతుల కుటుంబాలకు నిమ్జ్ లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.1988లో వెమ్ టెక్ ప్రారంభించిన తరువాత రక్షణ రంగంలో అగ్రగామిగా ఉన్నామని  అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ ద్వారా మన దేశంలోనే రక్షణ రంగ పరికరాలు తయారీ అవుతున్నాయన్నారు. దేశ రక్షణలో కీలక భూమిక పోషిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, ఎంపీ బిబి పాటిల్, జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్,డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, సీడిసి చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, జిల్లా జడ్పి చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, తెరాస మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.