భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ

రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : క్యాతన్ పల్లి మున్సిపాలిటీ రజక సంఘం, బిజోన్ వారి ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 128వ జయంతి వేడుకలు మంగళవారం. ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ ఇన్చార్జ్ గాండ్ల సమ్మయ్య హాజరయ్యారు. చాకలి ఐలమ్మ విగ్రహానికి గాండ్ల సమ్మయ్య, రజక సంఘం అధ్యక్షులు నడిగోట తిరుపతి, ఒకటో వార్డు కౌన్సిలర్ పోగుల మల్లయ్య లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాం రాష్ట్ర ఆంధ్ర మహా సభ నాయకత్వంలో భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ అని, ధైర్యవంతురాలైన ఐలమ్మ వంగి దండాలు పెట్టే రోజుల్లో శివంగిలా గర్జించారని పేర్కొన్నారు. ఆమె పోరాట స్ఫూర్తి దేశ్ముఖ్ ను ఎదిరించిన వైనం మహిళా శక్తికి స్ఫూర్తి దాయకమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాకలి ఐలమ్మ జయంతిని అధికారికంగా జరపవలసిందిగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలు ఇవ్వడం ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు జాలిగం రాజేశ్వరి, సంఘ సభ్యులు పాల్గొన్నారు.