భోగిమంటలతో సంక్రాంతికి స్వాగతం

అనంతపురం,జనవరి14(జ‌నంసాక్షి): జిల్లాలో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలుచోట్ల సందడిగా నిర్వహించారు. గ్రామాల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. అధికారులు, ఉద్యోగులు భోగి మంటలు వేశారు.చెక్క భజనలో అడుగేస్తూ, గళం కలిపారు. చిన్నారుల సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.గ్రావిూణ ప్రాంతాల్లో పంటలు చేతికి అంది, రైతులు సంతోషంలో ఉన్నారని మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. ప్రతి ఒక్కరూ పండగను సంతోషంగా చేసుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం చంద్రన్న కానుకలు అందజేసిందన్నారు. జిల్లాకు హంద్రీనీవా ద్వారా జలాలు రావడంతో చెరువులు, జలాశయాల్లో నీరు పుష్కలంగా ఉన్నాయన్నారు. వచ్చే వేసవిలో తాగునీటి సమస్యను అధిగమిస్తామన్నారు. సంక్రాంతి పర్వదినానికి ఘన స్వాగతం పలికారు. మూడు రోజుల సంక్రాంతి పర్వదినం ప్రాధాన్యం చాటేలా విద్యార్థినులు భోగి, సంక్రాంతి, కనుమ ఆకృతుల్లో కూర్చుని మన సంస్కృతిని ప్రతిబింబించేలా స్ఫూర్తిని నింపారు. పాఠశాల ఆవరణలో భోగి మంటలు వేసి భోగభాగ్యాలకు స్వాగతం పలికారు. గొబ్బెమ్మలతో రంగవల్లులను సుందరంగా తీర్చిదిద్దారు. సంక్రాంతి సందడి సరదాల సవ్వడితో బాలికల ఆటలు పాటలు కనువిందు చేశాయి. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే

తుమ్మెదా అంటూ నృత్యాలు చేస్తూ సందడి చేశారు.