భోజనంలో పురుగులు: ఆందోళన చేసిన విద్యార్థినులు

తిరుపతి,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి):  తిరుపతిలోని పలమనేరు పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థినులు బుధవారం నిరసన చేపట్టారు. తినే భోజనంలో తరచూ పురుగులు రావడంతో విసుగు చెందిన విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ.. రెగ్యులర్‌గా భోజనంలో పురుగులు వస్తున్నాయని తెలిపారు. వంట చేసే వారిని అడిగితే తమపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. భోజనవసతి సరిగ్గా లేదని, యాజమాన్యం తమ సమస్యల్ని దృష్టించాలని డిమాండ్‌ చేశారు. అకాడమిక్‌ బ్లాక్‌ ఆవరణలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నిరసన కొనసాగుతోంది.

తాజావార్తలు