మంకీపాక్స్ తొలి మరణంతో అప్రమత్తం
అనుమానిత కేసుల్లో వైద్యపరీక్షలు
తిరువనంతపురం,ఆగస్ట్1 జనంసాక్షిః దేశంలో మంకీపాక్స్‌తో తొలి మరణం నమోదు కావడంతో కేంద్రం అప్రమత్తం అయ్యింది. ఇలాంటి కేసులను సత్వరం గుర్తించిచికిత్సలు అందించాలని రాష్టాల్రకు ఆదేశించింది. ఇప్టపికే పలు సూచనలు చేసింది. కేరళలోని త్రిస్సూర్‌కు చెందిన యువకుడు(22) మంకీపాక్స్ కారణంగా ఆదివారం చనిపోయాడు. ఈ విషయాన్ని కేరళ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఆ యువకుడి స్వగ్రామం చావక్కడ్ కురంజియూర్. జూలై 21న యువకుడు యూఏఈ నుంచి వచ్చాడు. అనారోగ్యంతో త్రిస్సూర్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. మంకీపాక్స్ లక్షణాలు ఉండటంతో అతని నమూనాలను పరీక్షలకు పంపించారు. ఆ నివేదికలు ఇంకా రాకముందే యువకుడు చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం చనిపోయాడు. అయితే, అతనికి యూఏఈలోనే వైరస్ సోకిందని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వెల్లడిరచారు. అతడు మంకీపాక్స్‌తోనే చనిపోయినట్లు ధ్రువీకరించారు. యూఏఈ లోనే అతడు పరీక్షలు కూడా చేసుకొన్నాడని, పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ఆ విషయాన్ని యువకుడు, అతని కుటుంబసభ్యులు దాచి పెట్టారని తెలిపారు. శనివారం అసలు విషయం చెప్పారని వీణా జార్జ్ వెల్లడిరచారు. కాగా, తమిళనాడులో మంకీ పాక్స్ కేసులు నమోదైనట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ఆరోగ్య మంత్రి మా సుబ్రహ్మణ్యం ఖండిరచారు. అయితే, నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలతో పాటు కేరళతో ఉన్న 13 సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.