మంకీపాక్స్‌ డేంజర్‌బెల్స్‌

` భారత్‌లో తొలికేసు నిర్ధారణ
` క్లేడ్‌`2 రకంగా గుర్తింపు
` ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
` అనుమానితులకు పరీక్షలు చేయండి
` కాంటాక్టులను గుర్తించండి
` కేంద్రం నుంచి రాష్ట్రాలకు సూచన
న్యూఢల్లీి(జనంసాక్షి):భారత్‌లో మంకీపాక్స్‌ కేసు నిర్ధరణ అయ్యింది. విదేశాల నుంచి వచ్చిన ఓ యువకుడి నమూనాలను పరీక్షించగా.. అది పశ్చిమ ఆఫ్రికాలో వ్యాప్తిలో ఉన్న క్లేడ్‌`2 రకంగా తేలింది.ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ప్రకటించి ఆత్యయిక స్థితికి కారణమైన క్లేడ్‌`1 కాదని.. ప్రస్తుతానికి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. బాధితుడి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని తెలిపింది.విదేశాల నుంచి భారత్‌కు వచ్చిన ఓ యువకుడిలో మంకీపాక్స్‌ లక్షణాలు గుర్తించారు. దీంతో వెంటనే ఐసోలేషన్‌లో ఉంచి నమూనాలను లేబొరేటరీకి పంపించారు. అది మంకీపాక్స్‌ అని నిర్ధరణ అయ్యింది. అయితే, గతంలో భారత్‌లో వెలుగు చూసిన (జులై 2022 నుంచి) 30 కేసుల మాదిరిగానే ఈ కేసు ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. డబ్ల్యూహెచ్‌వో ఇటీవల ప్రకటించిన ఆందోళనకర క్లేడ్‌`1 రకం కాదని స్పష్టం చేసింది.మంకీపాక్స్‌ 1958లో డెన్మార్క్‌లో తొలిసారి కోతుల్లో వెలుగు చూసింది. వీటిని పరిశోధన కోసం తెప్పించడం గమనార్హం. 1970లో మానవుల్లో తొలిసారి గుర్తించారు. 2005లో కాంగోలో వేల సంఖ్యలో ఈ కేసులు నమోదయ్యాయి. 2017 తర్వాత నైజీరియా సహా అనేక దేశాలకు వ్యాపించింది. 2022 నుంచి మళ్లీ విస్తృతంగా వ్యాప్తి చెందుతూ అనేక దేశాలకు పాకింది. 2022 నుంచి ఆగస్టు 2024 వరకు 120 దేశాల్లో వెలుగుచూడగా.. సుమారు లక్ష కేసులు నిర్థరణ అయ్యాయి. తాజాగా కాంగోలో ఆందోళనకర స్థాయిలో ప్రాణాంతక వైరస్‌ వ్యాపిస్తోంది.
మంకీపాక్స్‌ అనుమానితులకు పరీక్షలు..
కాంటాక్టులను గుర్తించండి: కేంద్రం నుంచి రాష్ట్రాలకు అడ్వైజరీ
ఓజూనీలీ ఇంటర్నెట్‌డెస్క్‌: దేశంలో తొలిసారి మంకీపాక్స్‌ అనుమానితుడిని గుర్తించడంతో కేంద్రం అప్రమత్తమై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక అడ్వైజరీ జారీ చేసింది.ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వ్యాధిని పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా జారీ చేసిన హెల్త్‌ అడ్వైజరీ ప్రకారం భారత్‌లో ఇప్పటి వరకు ఒక్క మంకీపాక్స్‌ కేసు కూడా నిర్ధరణ కాలేదు. కానీ, దీని విషయంలో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ క్రమంలో ఆరోగ్యమంత్రిత్వ శాఖ సూచించిన వ్యూహాలను అమలు చేయాలని పేర్కొంది.దేశంలో మంకీపాక్స్‌ క్లస్టర్లను గుర్తించడానికి నేషనల్‌ ఇంటిగ్రేటెడ్‌ సర్వైలెన్స్‌ ప్రోగ్రామ్‌ పనిచేస్తోందని పేర్కొన్నారు. ఎయిర్‌ పోర్టుల్లో మంకీపాక్స్‌ స్క్రీనింగ్‌ మరింత వేగవంతం చేసినట్లు వెల్లడిరచింది. అనుమానిత కేసులను పరీక్షించేందుకు వీలుగా ఐసీఎంఆర్‌ ఆధీనంలోని పరిశోధనాశాలల నెట్‌వర్క్‌ను బలోపేతం చేస్తున్నట్లు హెల్త్‌ మినిస్ట్రీ పేర్కొంది. రాష్ట్రాలు చర్మ, ఎస్‌టీడీ వ్యాధులకు చికిత్స చేసే క్లీనిక్స్‌పై దృష్టిపెట్టాలని సూచించింది. వ్యాధి లక్షణాలు కనిపించిన పేషెంట్ల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఈ వ్యాధి, దాని వ్యాప్తిపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని తెలిపింది. ప్రజల్లో అనవసర భయాలు పొగేట్టేందుకు కృషి చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ తన అడ్వైజరీలో పేర్కొంది.ఈ వ్యాధిని 1958లో తొలిసారి గుర్తించారు. 1970లో మొదటిసారిగా ఓ మనిషికి ఇది సోకింది. ముఖ్యంగా ఉష్ణమండల ఆఫ్రికా దేశాల్లోని మారుమూల గ్రామాల్లో మాత్రమే ఎక్కువగా కనిపించేది. అయితే ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ఆరోగ్య విభాగాలు దీనిని నిర్లక్ష్యం చేశాయి. తొలిసారి 2022లో భారీస్థాయిలో మంకీపాక్స్‌ వ్యాపించింది. దీంతో ఉలిక్కిపడిన ప్రపంచ దేశాలు దీనిపై పరిశోధనలకు నిధులను పెంచాయి. మంకీపాక్స్‌లో రెండు వేరియంట్లు ఉన్నాయి. క్లాడ్‌`1 (కాంగోబేసిన్‌ క్లాడ్‌), క్లాడ్‌`2 (పశ్చిమ ఆఫ్రికా క్లాడ్‌)గా వర్గీకరించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్లాడ్‌`1 ఐబీ వేరియంట్‌ వేగంగా వ్యాపించడమే ఆందోళనకు కారణం. లైంగిక సంబంధాల కారణంగా ఈ వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తుంది.

తాజావార్తలు