మంచి నీటి కుంటను దుర్గంధ భరితంగా మార్చారు

అధికారుల ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్య ధోరణి.                                     * కొల్చారం మండలం రంగంపేటలోని పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తం                  * ప్రజలు మూగజీవాలు రోగాల బారిన పడే పరిస్థితి.*

జనం సాక్షి/ కొల్చారంమండలంలోని రంగంపేటలో అధికారుల నిర్లక్ష్యంతో  ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో లక్షల రూపాయలు ఖర్చుపెట్టి డంప్ యార్డ్ ను నిర్మిస్తే  నిరుపయోగంగా మారింది. పంచాయతీ కార్యదర్శి స్థానికంగా ఉండకపోవడం, పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామంలో సేకరించిన చెత్తను నివాసాల దగ్గర ఉన్న అవుసులోని కుంటలో గ్రామపంచాయతీ ట్రాక్టర్ తో గ్రామపంచాయతీ సిబ్బంది పారబోస్తున్నారు. దీంతో కుంట పూర్తిగా నిండిపోయి నీటి నిల్వ సామర్థ్యం కోల్పోతుంది. ఉన్న కొద్దిపాటి నీరు మురికిగా ఉండడం, చెత్తను తగలబెట్టడంతో వాతావరణ కాలుష్యమై దుర్వాసన వెలువడుతుంది. ఈ వాసనతో కుంటకు దగ్గరలో ఉన్న ఇండ్లవాలు, చుట్టుపక్కల ఉన్న పొలాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా ప్రజారోగ్యం పట్టించుకునే నాతుడే లేడు. కుంటలో చెత్తను వేయడం ఏమిటి అని ఎవరైనా ప్రశ్నిస్తే సర్పంచ్ వేయమన్నారని పారిశుద్ధ్య సిబ్బంది సమాధానం ఇస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి స్థానికంగా ఉండకపోగా మండల పంచాయతీ అధికారి పర్యవేక్షణ లేకపోవడంతో రంగంపేట గ్రామపంచాయతీ మురికి కూపంగా మారుతుందని, పనులు ఇస్టారాజ్యాంగ జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

తాజావార్తలు