మండల అధికారుల అధ్వర్యంలో ముగ్గుల పోటీలు

 

జనంసాక్షి / చిగురుమామిడి – ఆగష్టు 20:
భారత స్వాతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా మండల కేంద్రం లోని హైస్కూల్ ఆవరణలో శనివారం మండల అధికారుల ఆధ్వర్యంలో మండల స్థాయిలో ముగ్గుల పోటీలు నిర్వహించారు.25మంది మహిళలు స్వాతంత్ర్యాన్ని సూర్తి నింపేలా ముగ్గులు వేశారు. రంగవల్లులు అందరిని ఎంతగానే ఆకట్టుకున్నాయి. మహిళలల విభాగంలో మొదటి బహుమతి ఇందుర్తి గ్రామానికి చెందిన కత్తి రమాదేవి, రెండవ బహుమతి రామంచ గ్రామానికి చెందిన పైస రమ, మూడవ బహుమతి మండల కేంద్రానికి చెందిన జె.శ్వేత ,అలాగే జూనియర్స్ విభాగంలో కస్తూర్బా విద్యార్థులు ఎ.స్ఫూర్తి మొదటి బహుమతి, జె. అంజలి రెండవ బహుమతికి ఎంపికయ్యారు. వీరికి మండల స్థాయి వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమంలో అనగా 22 వ తేదీన బహుమతులు, పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతి ఇవ్వనునట్లు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి, జడ్పీటీసీ గీకురు రవీందర్, ఎంపీడీవో నర్సయ్య, యస్ఐ దాస సుధాకర్, సూపరింటెండెంట్ ఖాజామోయినోద్దీన్, ఎపియం సంపత్, ఎపీవో లక్ష్మి, సర్పంచ్ లక్ష్మణ్ , పంచాయతీ కార్యదర్శి జి. వెంకట రమణ, సత్యనారాయణ, సంపత్, వెంకటమల్లు,వెంకటేశ్వర్లు, మండల సమాఖ్య ఓ.బి.హరిణి,మౌనిక,సమాఖ్య సిబ్బంది శైలజ,శివ,లక్ష్మణ్,అన్ని గ్రామాల విఓఏలు ,మహిళలు,తదితరులు పాల్గొన్నారు.