మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులుగా నాగేశ్వరరావు

శివ్వంపేట జూలై 19 జనంసాక్షి : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశాల మేరకు, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి బుధవారం మండల పరిధిలోని దంతాన్ పల్లి గ్రామానికి చెందిన భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు ఎం. నాగేశ్వరరావు ను శివ్వంపేట మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులుగా నియమిస్తూ, ఆదేశాలు జారీ చేసినట్లు బిఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రమణా గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులుగా నూతనంగా నియమకమైన ములుగు నాగేశ్వరావు మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన శివ్వంపేట మండల బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు, నాయకులకు, ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మండలంలో రైతన్నల సంక్షేమం కొరకు, వారి అభివృద్ధి కొరకు, నిర్విరామంగా, శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు.