మండుతున్న ఎండలు : రాయలసీమలో 43 డిగ్రీల

హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. రాయలసీమలో సాధారణం కన్నా 4, కోస్తాంధ్ర, తెలంగాణల్లో సాధారణం కన్నా 2 డిగ్రీలు ఎక్కువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు  నమోదవుతున్నాయి. రాయలసీమలో ఈరోజు  43 డిగ్రీల గరిష్ఠ ఉస్ణోగ్రత నమోదు కాగా, కోస్తాంధ్ర , తెలంగాణల్లో 41 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.