మంత్రాలయంలో మానవహక్కుల బృందం పర్యటన

 

కరవు కారణంగా ప్రజల వలసలపై ఆరా

కర్నూలు,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం, కోసిగి మండలాల్లో మానవ హక్కుల వేదిక బృందంమండలంలోని పలు గ్రామాల్లో పర్యటించింది. కరువు,వలసలు, కారణంగా గ్రామాలు వదిలి గుంటూరు, బెంగళూరు ప్రాంతాలకు వలస వెళుతున్న పరిస్థితి ఉంది. ఈ విషయంగా మానవ హక్కుల వేదిక కౌతాళం మండలం లోని , గ్రామాలకు వెళ్లి పరిశీలించడం జరిగింది. పలు గ్రామాల్లోని ప్రజలు వర్షాలు లేక, గ్రామాల్లో ఉపాధి పనులు చేసిన, సకాలంలో వేతనాలు ఇవ్వనందున గ్రామాల్లో సుమారు 75 శాతం ప్రజలు వలస వెళ్లడం జరిగింది. ప్రతి గ్రామాల్లో తాగునీటి సమస్య పశువులకు గ్రాసం లేక సగం కంటే తక్కువ ధరకే పశువులను అమ్ముకుంటున్న పరిస్థితి ఉన్నందున ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కరువును విపత్తుగా ప్రకటించిన ప్పటికి , రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించి చేయి దులుపుకొంది అని అన్నారు.కరువు మండలాల్లో పశువులకు దాణా గ్రాసం, ప్రజలకు ఉపాధి హావిూ పనులు తాగునీటి సమస్య తీర్చకపోతే రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలతో కలిసి మానవ హక్కుల వేదిక పెద్ద ఎత్తున ఆందోళన చేపడతుందని అని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమం లో మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు యు జి శ్రీనివాసులు, జిల్లా ప్రధాన కార్యదర్శి బీ ణ దేవేంద్ర బాబు, మరియు జిల్లా అధ్యక్షులు ఉరుకుందప్పా, జిల్లా కార్యవర్గ సభ్యులు సూర్యనారాయణ ,రషీద్‌ పటేల్‌ ,విజయ్‌ కుమార్‌, మహమ్మద్‌ ఉద్రుస్‌ భాష, అరిఫ్‌, ఇతరులు పాల్గొన్నారు.