మంత్రిగౌతమ్ రెడ్డి మృతికి నేతల దిగ్భార్రతి
యువనేతను కోల్పోవడం పట్ల వెంకయ్య తీవ్ర విచారం
మేకపాటి మృతి తీరని లోటన్న గవర్నర్,సిఎంజగన్
సంతాపంప్రకటించిన టిడిపి అధినేత చంద్రబాబు
న్యూఢల్లీి,ఫిబ్రవరి21(ఆర్‌ఎన్‌ఎ): ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయడు తీవ్రవిచారం వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి ఎంతో సౌమ్యులు, సంస్కార వంతులని, ప్రజా సమస్యల పట్ల అవగాహన, చేసే పనిపట్ల నిబద్ధత కల్గిన వ్యక్తి అని వెంకయ్య నాయుడు కొనియాడారు. ’గౌతమ్ రెడ్డి తాత సమయం నుంచి వారి కుటుంబంతో సాన్నిహిత్యం ఉంది. గౌతమ్ రెడ్డి నేనంటే ఎంతో అభిమానం చూపేవారు. అలాంటి వ్యక్తి చిన్న వయసులోనే దూరం కావడం బాధాకరం. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను’ అని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో మృతి చెందడం పట్ల గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్భార్రతి వ్యక్తం చేశారు. మంత్రిగా గౌతమ్ రెడ్డి రాష్టాన్రికి విశేష సేవలు అందించార న్నారు. ఇంత చిన్న వయస్సులో మృతి చెందడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని… కుటుంబ సభ్యులకు గవర్నర్ బిశ్వభూషన్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భార్రతి వ్యక్తం చేశారు. గౌతమ్‌రెడ్డి తనకు తొలినాళ్ల నుంచి సుపరిచితుడైన యువ నాయకుడుగా పేర్కొన్నారు. ఈ విషాద ఘటనపై జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన యువ మంత్రివర్గ సహచరుడిని కోల్పోవడం మాటల్లో చెప్పలేనంత బాధను కలిగించిదన్నారు. భారమైన హృదయంతో ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని జగన్ తెలియజేశారు.ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం తెలియజేశారు. మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతి కలచి వేసిందన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న మేకపాటి మృతి బాధాకరమని అన్నారు. మేకపాటి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందారని తెలిపారు. గౌతమ్‌రెడ్డి కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.