మంత్రివర్గంలో చోటు దక్కకపోవటంపై అసంతృప్తి లేదు: రాయపాటి
హైదరాబాద్: పోలవరం టెండర్లు ట్రాన్స్‌ట్రాయ్ సంస్థకు దక్కడంలో తనకెటాంటి సంబంధం లేదని ఎంపీ రాయపాటి సాంబశివరావు తెలియజేవారు. అన్ని అర్హతలు ఉన్నాయి.కాబట్టే ఆ సంస్థకు టెండర్లు దక్కాయని ఆయన వ్యాఖ్యానించారు. సచివాలయంలో ఆయన ఈరోజు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిశారు, కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కకపోవటంపై ఎటాంటి అసంతృప్తి లేదన్నారు. దీనిపై తానెవరికీ ఫిర్యాదు చేయలేదని చెప్పారు. ముఖ్యమంత్రి మార్పు అనేది అధిష్ఠానం పరిధిలో అంశమని అభిప్రాయపడ్డారు.