మంత్రి కాల్వ శ్రీనివాస్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

అనంతపురం,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): మంత్రి కాల్వ శ్రీనివాస్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. జిల్లాలోని బెలుగుప్ప మండలం కాలువపల్లి దగ్గరలో శ్రీనివాస్‌ ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం జరిగింది. అయితే ఆయన ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కారు కల్వర్టును ఢీ కొట్టింది. వాహనంలో జెడ్పీ చైర్మన్‌ నాగరాజు కూడా ఉన్నారు. ఈ ఘటనలో ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు. వీరికి ఎలాంటి హాని కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఈప్రమాదంపై అధికారులు విచారణకు ఆదేశించారు. ప్రమాద విషయం సీఎం చంద్రబాబుకు తెలియడంతో ఫోన్‌ ద్వారా కాల్వను పరామర్శించారు. గతంలో మావోయిస్టులు మాజీ మంత్రి పరిటాల రవీంద్రను లక్ష్యంగా మందుపాతర పేల్చారు. అయితే ఈ ప్రమాదంలో పరిటాల క్షేమంగా బయటపడ్డారు. కాన్వాయ్‌లో చివరి వాహనంలో ప్రయాణిస్తున్న కాల్వ శ్రీనివాస్‌ వాహనం పేలుడుధాటికి పల్టీలు కొట్టింది. అప్పుడు కూడా ఆయన చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. రెండు ప్రమాదాలను చూసిన జిల్లా వాసులు కాల్వ మృత్యుంజయుడు అంటూ కొనియాడుతున్నారు.

తాజావార్తలు