మంత్రి కుమారుడిపై కేసు నమోదు
వరంగల్ : మంత్రి సారయ్య కుమారుడు శ్రీమాన్‌పై వరంగల్ మట్టేవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న వరంగల్‌లో మున్సిపాల్ మంత్రి మహీధర్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పలు అభివృద్ది కార్యక్రమాలు పాల్గొన్నారు. ఈ పర్యటన సందర్భంగా తెరాస శ్రేణులు వారిని అడ్డుకునే ప్రయాత్నం చేశారు. సారయ్యను అడ్డుకుంటుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారని, మంత్రి తనయుడు మట్టేవాడ పోలీస్ స్టేషన్‌లో వీరంగం సృష్టించాడు. మట్టేవాడ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ రమేష్ ను వ్యక్తిగతంగా దూషించడంతో మానస్థాపం చేందిన ఎస్‌ఐ రమేష్ విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకేళ్లారు. కేసు నమోదు చేయాల్సిందిగా అదేశాలు ఇవ్వడంతో సేక్షన్లు 355, 448, 294బి మూడు సేక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ లావణ్య ప్రకటించారు. మద్యం మత్తులో మంత్రి తనయుడు అకారణంగా దూషించడాని ఎస్‌ఐ రమేష్ తెలియజేశారు.