మంత్రి కేటీఆర్ క్యాంప్ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తం.

మంత్రి కేటీఆర్ క్యాంప్ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తం. 

 

రాజన్న సిరిసిల్ల బ్యూరో. సెప్టెంబర్ 25. (జనంసాక్షి). ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అంగన్వాడి టీచర్లు హెల్పర్లు మంత్రి కేటీఆర్ క్యాంపు కార్యాలయం ముట్టడి ఉద్రిక్తంగా మారింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అంగన్వాడీల ఆందోళనలో భాగంగా జిల్లాలోని అంగన్వాడీలు మంత్రి కేటీఆర్ క్యాంపు కార్యాలయానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆందోళనకు దిగారు. పోలీసులు ఏర్పాటుచేసిన భారీకేట్లను దుసుకొని క్యాంపు కార్యాలయం లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. తోపులాటలతో అంగన్వాడి జిల్లా నాయకురాలు స్వల్పంగా గాయపడ్డారు. అంగన్వాడీలు పోలీసులతో వాగ్వివాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. రోడ్డుపై బైఠాయించిన అంగన్వాడీలు ఆందోళన కొనసాగించారు. ఏఐటీయూసీ జిల్లా నాయకులు కడారి రాములు మాట్లాడుతూ తక్షణమే అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం మంత్రి కేటీఆర్ పీఏకు వినతి పత్రం అందజేశారు. నిరసన కార్యక్రమంలో పలువురు ఏఐటీయూసీ నాయకులు జిల్లా లోని అన్ని ప్రాంతాల నుండి అంగన్వాడీలు పాల్గొన్నారు.