మంత్రి దయాకర్ రావును కలిసిన దసరా ఉత్సవ కమిటీ
మంత్రి దయాకర్ రావును కలిసిన దసరా ఉత్సవ కమిటీ
వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 12 (జనం సాక్షి)వరంగల్ నగరంలోని అండర్ రైల్వే గేట్ వరుసు రంగ లీలా మైదానంలో నిర్వహించే సద్దుల బతుకమ్మ దసరా వేడుకలను గతంలో కంటే మరింత వైభవంగా నిర్వహించేందుకు సహకరించాలని ఉరుసు కరీమాబాద్ దసరా ఉత్సవ కమిటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కోరారు. ఈ మేరకు గురువారం ఆయనను దసరా ఉత్సవ కమిటీ అధ్యక్షులు నాగపూరి సంజయ్ బాబు ఆధ్వర్యంలో కలిసింది. ఈ సందర్భంగా మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ ఉత్సవాలను మరింత గొప్పగా దిగ్విజయంగా నిర్వహించేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి మేడిది మధుసూదన్ కోశాధికారి మండల వెంకన్న కన్వీనర్ వడ్నాల నరేందర్, గోనే రాంప్రసాద్, వంగరి కోటేశ్వర్ వెంకన్న సందీప్ గోవర్ధన్ చిరంజీవి కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.