మంత్రి పొన్నాలకు తప్పిన ప్రమాదం
కరీంనగర్: ఓ ప్రైవేటు ఆసుపత్రి ప్రారంభోత్సవంలో ఆపశృతి చోటు చేసుకుంది. ఈ ఘటనలో మంత్రి పొన్నాలకు ప్రమాదం తప్పింది. పై అంతస్తు నుంచి లిఫ్ట్‌లో దిగుతుండగా ఆకస్మాత్తుగా లిఫ్ట్ కూలింది. లిఫ్ట్ నుంచి పొన్నాలను సిబ్బంది బయటకు తీశారు దీంతో క్షేమంగా ఆయన బయటపడ్డారు.