మంత్రి వాఖ్యలకు నిరసనగా బయ్యారంలో రాస్తారోకో
బయ్యారంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం*
*• బయ్యారంలో ఉక్కు కర్మాగారం సాధ్యపడదు:కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి*
*•మంత్రి వాఖ్యలకు నిరసనగా బయ్యారంలో రాస్తారోకో*
బయ్యారం,సెప్టెంబర్27(జనంసాక్షి
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బయ్యారంలో ఉక్కు కర్మాగారం నిర్మించడం సాధ్యపడదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యనించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై తెరాస శ్రేణులలో తీవ్ర వ్యతిరేకత వెళ్లువెత్తింది.విభజన చట్టంలో పొందుపరిచిన బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పడం కేంద్ర ప్రభుత్వం వల్ల కాదని కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మహబూబాబాద్ జిల్లా బయ్యారం లో తెరాస పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ మేరకు స్థానిక ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ విభజన చట్టంలో హామీలను తుంగలో తొక్కుతూ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హేయమైనవన్నారు.ఉక్కు కర్మాగారం నెలకొల్పితే స్థానిక గిరిజన, గిరిజనేతర యువత ఉపాధి కల్పనతో లబ్ది చేకూరుతుందని ఎన్నో ఆశలతో ఉన్నారని, వారి భవిష్యత్తు మీద కేంద్రం ప్రభుత్వం దెబ్బకొట్టడం సరికాదన్నారు.బయ్యారం లో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి కావాల్సిన ముడిసరుకు, నీటి వనరులు,విద్యుత్తు, రవాణా సదుపాయాలు ఉన్నప్పటికీ , కేంద్ర బృందం , సెయిల్, సింగరేణి మొదలగు సంస్థలు ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి అనుకూలంగా నివేదికలు ఇచ్చినప్పటికీ, పార్లమెంటు సాక్షిగా విభజన చట్టంలో పొందుపరచి నప్పటికీ ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మాణానికి అనుకూలంగా లేదు, ఫ్యాక్టరీ నిర్మాణం చేయడం కుదరదు అని కేంద్ర మంత్రి చెప్పడం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దుర్నీతి కి నిదర్శనమని ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టడం వల్ల ఇక్కడి గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు మెరుగై ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజనులు అభివృద్ధి చెందే అవకాశం ఉన్నప్పటికీ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రైవేటు పరం చేసే ఉద్దేశ్యంతో ఉన్నదని దానిలో భాగంగానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారని తెలంగాణ పట్ల కేంద్రం మొండి వైఖరి విడిచి ఇప్పటికైనా బిజెపి ప్రభుత్వంనకు కనువిప్పు కలిగి బయ్యారం లో చిరకాల వాంఛ ఐన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనీ లేకుంటే భవిష్యత్తులో అనేక ఆందోళనలు చేసి కేంద్ర ప్రభుత్వ మెడలు వంచుతామని, రాబోయే కాలంలో రాష్ట్రంలో డిపాజిట్ రాకుండా చేస్తామని హెచ్చరించారు.మహబూబాబాద్ జిల్లా ఛైర్పర్సన్ బిందు మాట్లాడుతూ… మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో తెలంగాణ పునర్విభజన చట్టంలో పొందుపరచిన బయ్యారం ఉక్కు పరిశ్రమ ను ఏర్పాటు చేయకుండా అడ్డుకుంటున్న బిజెపి ప్రభుత్వ చర్యలకు నిరసనగా తెరాస పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రాస్తారోకో లో పాల్గొన్న బిందు బయ్యారం లో ఉక్కు కర్మాగారం స్థాపించడం కుదరదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందని , ఇది కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పై చేసే కుటిల ప్రయత్నమని , రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా చేసి రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని అలాంటి ప్రయత్నాలు తెలంగాణ ప్రజలు తిప్పికొట్టే రోజు వస్తుందని , ఒక తెలంగాణ బిడ్డగా ఉండి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వ పెద్దలు, మోడీ మెప్పు కోసం, తన పదవి కాపాడుకోవడం కోసం పనిచేయడం శోచనీయమని బయ్యారం లో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి కావాల్సిన ముడిసరుకు, నీటి వనరులు,విద్యుత్తు, రవాణా సదుపాయాలు ఉన్నప్పటికీ , కేంద్ర బృందం , సెయిల్, సింగరేణి మొదలగు సంస్థలు ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి అనుకూలంగా నివేదికలు ఇచ్చినప్పటికీ, పార్లమెంటు సాక్షిగా విభజన చట్టంలో పొందుపరచి నప్పటికీ ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మాణానికి అనుకూలంగా లేదని , ఫ్యాక్టరీ నిర్మాణం చేయడం కుదరదని కేంద్ర మంత్రి చెప్పడం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దుర్నీతి కి నిదర్శనమని ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టడం వల్ల ఇక్కడి గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు మెరుగై ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజనులు అభివృద్ధి చెందే అవకాశం ఉన్నప్పటికీ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రైవేటు పరం చేసే ఉద్దేశ్యంతో ఉన్నదని దానిలో భాగంగానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారని తెలంగాణ పట్ల కేంద్రం మొండి వైఖరి విడిచి ఇప్పటికైనా బిజెపి ప్రభుత్వంకు కనువిప్పు కలిగి బయ్యారం లో చిరకాల వాంఛ అయిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనీ లేకుంటే భవిష్యత్తులో అనేక ఆందోళనలు చేసి కేంద్ర ప్రభుత్వ మెడలు వంచుతామని, రాబోయే కాలంలో రాష్ట్రంలో డిపాజిట్ రాకుండా చేస్తామని హెచ్చరించారు. అనంతరం తెలంగాణ పట్ల కేంద్రం లోని బిజెపి ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా మోది దిష్టి బొమ్మను దహనం చేశారు.ఈ కార్యక్రమంలో లో ఇల్లందు ఎం ఎల్ ఎ హరిప్రియ, భద్రాద్రి కొత్తగూడెం గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ హరి సింగ్ నాయక్, బయ్యారం పాక్స్ చైర్మన్ శ్రీ మూల మధుకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ తాతా గణేష్, తెరాస జిల్లా నాయకులు శ్రీకాంత్ నాయక్ , భూక్యా ప్రవీణ్ నాయక్, పులిగండ్ల మాధవ రావు, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు పోలే బోయిన వేంకటేశ్వర్లు, సొసైటీ వైస్ చైర్మన్, రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ రాసమల్ల నాగేశ్వర్ రావు, సొసైటీ డైరెక్టర్ లు, సర్పంచులు, ఉప సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, వార్డు సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు, తెరాస పార్టీ మండల కార్యదర్శి బత్తిని రామ్మూర్తి గౌడ్, మండల కార్యవర్గ సభ్యులు, గ్రామ శాఖ తెరాస అధ్యక్షులు, కార్యదర్శులు, తెరాస నాయకులు కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.