మంత్రి సత్యవతిరాథోడ్ వినతికి స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్…
రాష్ట్రవ్యాప్తంగా మంత్రి సత్యవతిరాథోడ్ కు అభినందనలు
కురవి సెప్టెంబర్-12
(జనంసాక్షి న్యూస్)
అసెంబ్లీ సమావేసంలో సిఎం కెసిఆర్ కు లిఖిత పూర్వక విజ్ఞప్తిని అందచేసిన రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్…పోలీస్ రిక్రూట్ మెంట్ అర్హత కటాఫ్ మార్కుల్లో ఓసీ, బీసీలకు మాదిరిగానే ఎస్సీ,ఎస్టీలకు కూడా సమ న్యాయం చేయాలని కోరుతూ.. రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశుసంక్షేమశాఖలమంత్రి సత్యవతిరాథోడ్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అసెంబ్లీలోనే వినతిపత్రం అందజేశారు..
సభలోనే మంత్రి సత్యవతిరాథోడ్ సమస్యను విన్నవించడం.. వినతిపత్రాన్ని అందజేయడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా తక్షణమే స్పందించారు.
ఎస్సీ,ఎస్టీలకు సమన్యాయంచేస్తామని,అదే నిష్పత్తిలో తగ్గిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అసెంబ్లీలో హామీ ఇచ్చారు. ఎస్సీ,ఎస్టీలకు కటాఫ్ మార్కులను తగ్గించాలంటూ
సభలో సిఎం కెసిఆర్ కు లిఖిత పూర్వక విజ్ఞప్తిని రాష్ట్ర గిరిజన,స్త్రీ-శిశు సంక్షేమశాఖలమంత్రి సత్యవతి రాథోడ్ అందజేయడం… వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డులో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వమని హామీ ఇవ్వడం… మిగతా వర్గాల అభ్యర్థులకు ఏ శాతం మార్కులు తగ్గించామో అవే శాతం మార్కులను కటాఫ్ గా ఎస్సీ, ఎస్టీలకు కూడా తగ్గిస్తామని ప్రకటించడంతో… పోలీస్ రిక్రూట్‌మెంట్ కు హాజరవుతున్న ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు ఆనందపడుతున్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ కు, తమ సమస్యపై స్పందించి న్యాయం జరిగేలా చూసిన మంత్రి సత్యవతి రాథోడ్ కు రాష్ట్రవ్యాప్తంగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు.