మంత్రులు ద్వంద్వ విధానాలకు స్వస్తి పలకాలి
తెదేపా జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు
పెద్దపల్లి గ్రామీణం, (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతి నిధులు ద్వంద్వ విధానాలకు పాల్పడుతున్నారని సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌నాయకులు విడివిడిగా మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ వట్టిస్తున్నారని తెదేపా జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు విమర్శించారు. గురువారం ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్‌కు చెందిన మంత్రులు దానం నాగేందర్, ముఖేష్‌గౌడ్ ప్రత్యేక రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ ఏర్పాటు చేయాలని కోరిన నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీయే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు ప్రయత్నింస్తుందన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలే గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. ఈ నెల 28న ప్రత్యేక రాష్ట్రానికి అనుకూల ప్రకటన రాని పక్షంలో తెదేపా ఆధ్వర్యంలో ఉద్యమిస్తామన్నారు. ఆయన వెంట నాయకులు సయ్యద్ మస్రత్, తిరుపతి, వాసు , శ్రీనివాస్, సంపత్, రాజేందర్, జహీర్ పాల్గొనా