మచిలీపట్నం నుండి మంత్రాలయం వరకు వెళ్ళు రైలు కు స్వాగతం పలికిన గద్వాల బిజెపి నాయకులు

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 1 (జనం సాక్షి);

మచిలీపట్నం నుండి మంత్రాలయం వరకు వెళ్ళు రైలు మొట్టమొదటిసారిగా గద్వాల రైల్వే స్టేషన్ కు వచ్చిన సందర్భంగా శుక్రవారం స్వాగతం పలికి అనంతరం రైల్వే బోగికి పూజా కార్యక్రమం పాల్గొని స్వీట్లు పంచిన జోగులాంబ గద్వాల జిల్లాఅధ్యక్షుడు రామచంద్రరెడ్డి,బిజెపి, బీజేవైఎం నాయకులు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ
2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో రెట్టింపు రైల్వే లైన్లో ఇవ్వడం జరిగిందనీ, వందే భారత్ ప్రపంచ దేశాల సరసన నిలిచిందనీ,దేశవ్యాప్తంగా కొత్త మార్గాలు, డంబ్లింగ్లు వేయడం జరిగిందనీ,గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ రహదారులు రోజుకు 7 కిలోమీటర్లు వేస్తే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వంలో రోజుకు 32 కిలోమీటర్లు జాతీయ రహదారులు వేయడం జరుగుతుందనీ,
నరేంద్ర మోడీ పాలన లో రైల్వేలు, జాతీయ రహదారులు, ఆకాశ మార్గాలు, రెట్టింపు అయ్యాయని ఆయన అన్నారు. దేశాన్ని విశ్వ గురువుగా చేయాలని లక్ష్యంతో గతంలో 11వ స్థానం నుండి ప్రస్తుతం ఐదవ స్థానంలో నిలవడం నరేంద్ర మోడీ కృషి అని 2024లో నెంబర్ వన్ స్థానానికి తీసుకురావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారని అన్నారు..
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ ఎక్బోటే,అసెంబ్లీ కన్వీనర్ రామాంజనేయులు, జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు మీర్జాపురం వెంకటేశ్వర రెడ్డి, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కబీర్దాస్ నరసింహ, రాష్ట్ర ఓబిసి మోర్చా అధికార ప్రతినిధి నాగేంద్ర యాదవ్, కౌన్సిలర్ రజక జయశ్రీ,, మల్దకల్ మండల అధ్యక్షుడు పాల్వాయి రాముడు,రజక నరసింహ, పట్టణమహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు భారతి, కోట్ల విరేష్, యం కె సత్యం తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు