మట్టి గణపతులను ప్రోత్సహించి పర్యావరణాన్ని కాపాడండి
ఎంపీడీఓ గార్లపాటి జ్యోతిలక్ష్మి మిర్యాలగూడ, జనం సాక్షి:వినాయక చవితి పండుగ పర్వదినాలలో మట్టి గణపతులను ప్రోత్సహించి పర్యావరణాన్ని కాపాడాలని మిర్యాలగూడ ఎంపీడీఓ గార్లపాటి జ్యోతిలక్ష్మి అన్నారు.శుక్రవారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో రైతు వేదికలో మట్టి విగ్రహాలను ప్రకృతి ప్రేమికుడు సురేష్ గుప్తా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రదర్శనను పలువురు సర్పంచ్ లతో కలిసి పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడుతూ మండల పరిధిలోని అందరు సర్పంచులు మట్టి గణపతి ప్రాంగణాలను ఏర్పాటుచేసి పర్యావరణo ను జీవ వైవిధ్యాన్ని సంరక్షించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా నవరాత్రులలో స్వచ్ఛ సంరక్షణ,హరితహారం, ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని నిషేధించి సిరి ధాన్యాల పంటలలో వచ్చే లాభాల గురించి గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రకృతి ప్రేమికుడు సురేష్ గుప్తా కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు సర్పంచులు పాల్గొన్నారు.