మణుగూరు ఏరియాలో పర్యటించిన సేఫ్టీ జిఎం

 

పినపాక నియోజకవర్గం జులై 12 (జనం సాక్షి): అధికారిక పర్యటనలో భాగంగా  ప్రధాన అధికారి జక్కం రమేష్ ఇతర విభాగాల అధికారులతో  కార్పొరేట్   జిఎం (సేఫ్టీ) గురువయ్య  ఏరియాలో సోమవారం పర్యటించారు.ఈ సందర్భంగా సేఫ్టీ మేనేజర్, సింగరేణి ఉన్నతాథికారుల బృందం  ఎం ఎన్ జి ఓ సి ప్రక్కనే ఉన్న గోదావరి నది ప్రవాహం  గురించి అధికారులను అడిగి తెలుసుకుని వరద పరిస్థితిని పరిశీలించారు. అనంతరం జిఎం కార్యాలయ  కాన్ఫరెన్స్ హాలులో రక్షణ, ఎస్ ఓ పి  అమలు తీరుపై అధికారులకు తగు సూచనలిచ్చారు.  ఎస్ఓ పి క్రియాత్మకంగా అమలుచేసి ప్రమాదాలను తగ్గించిన పరిస్థితిని గుర్తు చేస్తూ అదే స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. భారీ యంత్రాల మధ్య పని చేసే కార్మికులు ప్రమాదాల బారిన పడకుండా పనిలో అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ ప్రమాదాలను జయించేలా ఉద్యోగులలో రక్షణ పట్ల తరచుగా అవగాహన కల్గిస్తూ ఉండాల న్నారు. ముఖ్యంగా ఈ వర్షా కాలంలో భారీ వాహనాలను నడుపటం రిస్క్ తో కూడుకున్న పని  క్వారి లో రహదారుల నిర్మాణం వాహనాలు నడిచేందుకు అనువుగా తయారు చేయాలని ,వర్షా కాలపు వరద నీరు రహదారుల పై నిలవకుండా సైడ్ కాలువల ద్వారా నీళ్ళు మళ్లించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టు జిఎం డి లలిత్ కుమార్ , ఏజిఎం(కపియూజి)  జి నాగేశ్వర రావు , ఏరియా ఇంజినీర్ ప్రిట్టాల్డ్ , ఏఎస్  వెంకట రమణ , పిఓ పికేఓసి  లక్ష్మీపతి గౌడ్ , పిఓ ఎంఎన్ జి ఓసి  శ్రీనివాసా చారి,ఏరియా                 ఉన్నతాధికారులు,  ఇతర విభాగాల  అధికారులు తదితరులు పాల్గొన్నారు