మతం పేరుతో బిజెపి విచ్ఛిన్న రాజకీయం: నారాయణ

తిరుపతి,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): ప్రధాని నరేంద్రమోడి మతం పేరుతో దేశాన్ని విచ్చన్నం చేసే కుట్ర చేస్తున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. బిజేపిని ఓడించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. పార్టీ జాతీయ మహాసభల్లో పాల్గొనేందుకు తిరుపతికి వచ్చిన ఆయన గురువారం విలేకర్లతో మాట్లాడారు. నోట్లరద్దు వల్ల కోటీశ్వర్లందరు సుఖపడ్డారని, సామాన్యులు మాత్రం అవస్తలు పడ్డారని, 150 మందికి పైగా పేదలు డబ్బులు అందక చనిపోయారని గుర్తు చేశారు. నోట్లు రద్దును వ్యతిరేకించిన చంద్రబాబు, కేసిఆర్‌ ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత మోడిని పోగడటం వెనక పరమార్దం ప్రజలకు చెప్పాలన్నారు. రైతులకు రుణమాఫి చేయమంటే డబ్బులు లేవంటున్న పాలకులు కార్పోరేట్‌ వ్యక్తులకు వేల కోట్లు పన్ను రాయతీలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

తాజావార్తలు