మత్స్యద్రి వేములకొండ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలి..
జనం సాక్షి న్యూస్ ఆగస్టు 8. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వేములకొండ అఖిలపక్ష సాధన కమిటీ ఆధ్వర్యంలో 16వరోజుకుచేరుకున నిరసన దీక్షలో భాగంగా అఖిలపక్ష నాయకులు ప్లాకార్డ్స్ తో నిరసన దీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ వేములకొండ చుట్టుపక్కల గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు నిరసన దీక్షలు చేపట్టారు వలిగొండ మండల కేంద్రానికి వేములకొండ ఇరవై కిలోమీటర్ల దూరం ఉన్నందున పరిపాలన సౌలభ్యం కొరకు ప్రజలకు ఇబ్బందిగా ఉందని,ప్రభుత్వం నూతన మండలంగా మచ్చాద్రి వేములకొండను ప్రకటించాలని, స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని నూతన మండల కేంద్రంగా ఏర్పాటుకు రాష్ట్ర ముఖ్యమంత్రి పెషిలో తెలియజేయాలని అఖిలపక్షం నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో బోడ బాలయ్య సామరాంరెడ్డి కొత్త రామచంద్ర కొత్త నరసింహ బొడ సుదర్శన్ ఎలగందుల అంజయ్య గాదే వెంకటయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.