మదర్సాలో నేడు దీనీ జల్సా

బిచ్కుంద మార్చి 11 (జనంసాక్షి)
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలంలో గల పత్లాపూర్ గ్రామంలో ఈరోజు సాయంత్రం మగ్రిబ్ నమాజ్ 7 గంటల నుండి దీని జల్సా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు రహీం మౌలానా హాఫీజ్ మొయిన్ అక్బర్, అజీమ్ తదితరులు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యక్రమంలో పవిత్ర మాసమైన రంజాన్ ప్రాముఖ్యత మరియు ఖురాన్ హిఫ్జ్ చేసిన విద్యార్థులకు ధృవపత్రాలు అందజేస్తామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరారు. మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేసామని అన్నారు. ముఖ్య అతిథిలుగా హజరత్ మౌలానా ముజమ్మిల్ రశాది బెంగళూరు, హాఫీజ్ లయాఖ్ ఖాన్సాబ్ నిజామాబాద్ పాల్గొంటారని పేర్కొన్నారు.