మద్దతుధర కోసం రైతుసంఘాలకు రూ.6500 కోట్లు: మంత్రి ఈటల

కరీంనగర్: జిల్లాలో జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి ఈటల, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హాజరయ్యారు. సమావేశంలో మంత్రి ఈటల మాట్లాడుతూ.. వ్యవసాయ రంగాన్ని సంఘటిత రంగంలోకి తీసుకొచ్చేందుకు గ్రామ సమైక్య సంఘాలు ఏర్పాటు చేయబోతున్నామని పేర్కొన్నారు. మద్దతుధర కోసం రైతుసంఘాలకు రూ. 6500 కోట్లు ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు.
వచ్చే జూన్ నాటికి కరీంనగర్ జిల్లా వాటర్ హబ్‌గా మారనుందని ఈటల చెప్పుకొచ్చారు. వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ ఇస్తున్నామన్నారు. 15 -18 శాతం రుణాల్లో అక్రమాలు జరిగినా రైతులను ఇబ్బందులు పెట్టొద్దని రుణమాఫీ చేసిన విషయాన్ని మంత్రి ఈటల ఈ సందర్భంగా గుర్తు చేశారు.