మద్దతు ధర కోసం వైకాపా ధర్నా

 

తలమడుగు : రైతులు పండించిన పత్తి పంటకు కనీస మద్దతు ధర చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ శనివారం తలమడుగు మండల వైకాపా అద్వర్యంలో శుంకిడి అంతరాష్ట్ర రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు పలువురు పాల్గోన్నారు.