మద్యం మత్తులో ముంచుతున్నారు: ఐద్వా

గుంటూరు,నవంబర్‌19(జ‌నంసాక్షి): రాష్ట్రంలో పెద్ద ఎత్తున మధ్యాని ప్రభుత్వాలు ఆదాయ వనరుగా చేసుకొని ప్రజలని మద్యం మత్తులో బానిసలుగా మారుస్తున్నారని ఐద్వా మండిపడింది. మద్యం షాపులుకు బడి,గుడి లాంటి నిబంధనలు కూడా అతిక్రమించి ప్రజలు నివాసాల మధ్య వైన్‌ షాప్లుకి అనుమతులు మంజూరు చేస్తున్నారని విమర్శించారు.రేపల్లె నియెజవర్గంలో కూడా బెల్ట్‌ షాప్స్‌ ఎక్కడా

పడితే అక్కడ గ్రామాల్లో విచ్చలావిడిగా అమ్ముతున్నారు. మద్యానికి వ్యతిరేకంగా,మహిళలపై హింసను అరికట్టాలని అనే అంశంపై సదస్సు ఐద్వా రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో మద్యనిర్మలనా జాత జరుగుతున్నది ఈ జాత నవంబర్‌ 27 రేపల్లె నియోజకవర్గ పరిధిలో జయప్రదం కొరకు సన్నాహాకంగా రేపల్లె ఆదర్శ డిగ్రీ కాలేజీలో సదస్సు జరిగింది.ఈ సదస్సుకి ఎస్‌ఎఫ్‌ఐ రేపల్లె డివిజన్‌ గర్ల్స్‌ కన్వీనర్‌ ఎస్‌.రాజ్యలక్ష్మి అధ్యక్షత వహించగా ఐద్వా రేపల్లె డివిజన్‌ కమిటీ అధ్యక్షురాలు,గుంటూరు జిల్లా కమిటీ సభ్యులు పి.వీణదేవి తదితరులు హాజరయ్యారు. బెల్ట్‌ షాప్స్‌ ప్రోత్సాహిస్తూ మహిళలును ఇబ్బందులు గురుచేస్తున్నారని విమర్శించారు.రేపు రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే ప్రధాన రాజకీయ పార్టీలు మద్యం నిర్ములనను తమ మేనిఫెస్టోలో చేర్చాలని డిమాండ్‌ చేశారు.