మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం

నర్మదా నదిలో పడ్డ మహారాష్ట్ర బస్సు
ఘటనలో 13 మంది ప్రయాణికులు మృతి
సహాయక చర్యలు పర్యవేక్షించిన మంత్రి నరోత్తమ్‌

భోపాల్‌,జూలై18(జనంసాక్షి): మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. మహారాష్ట్రకు చెందిన ప్రభుత్వ బస్సు నర్మదా నదిలో పడిరది. ఈ ఘటనలో 13 మంది ప్రయాణికులు మరణించారు. ధార్‌ వద్ద ఈ ఘటన జరిగింది. దుర్ఘటన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 15 మందిని రక్షించినట్లు మధ్యప్రదేశ్‌ మంత్రి నరోత్తమ్‌ మిశ్రా తెలిపారు. ఇండోర్‌ నుంచి పూణె వెళ్తున్న బస్సు.. ధార్‌ జిల్లాలోని ఖల్‌ఘాట్‌ సంజత్‌ సేతు వద్ద ఉన్న లోయలో పడిరది. ధార్‌లోని ఖాల్‌ఘాట్‌లో అదుపుతప్పి బస్సు నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 12 మంది దుర్మరణం పాలయ్యారు. 15 మందిని రెస్క్యూ టీమ్‌ రక్షించింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులున్నట్లు తెలిసింది. వీరిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. మిగిలిన వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇండోర్‌ నుంచి పుణె వెళ్తుండగా ఘటన జరిగింది. ఉదయం 10.45 నిమిషాల సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలిసింది. మధ్యప్రదేశ్‌ హోం మంత్రి నరోత్తమ్‌ మిశ్రా ఈ దుర్ఘటనపై స్పందిస్తూ.. ప్రస్తుతానికి 15 మందిని ప్రాణాలతో కాపాడగలిగామని చెప్పారు.బ్రిడ్జి విూదకు బస్సు రాగానే ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసేందుకు బస్సు డ్రైవర్‌ ప్రయత్నించాడని.. ఆ క్రమంలోనే బస్సు అదుపు తప్పి వంతెనపై నుంచి నదిలో పడిపోయిందని పోలీసులు తెలిపారు. ఇండోర్‌, ధార్‌ నుంచి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఘటన గురించి తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మహారాష్ట్ర రాష్ట్ర రవాణా శాఖకు చెందిన బస్సుగా పోలీసులు గుర్తించారు. ఆ వంతెన చాలా పాతది కావడంతో బస్సు అదుపు తప్పి
రెయిలింగ్‌పై పడగానే ఆ రెయిలింగ్‌ కూడా కూలిపోయింది. ముఖ్యమంత్రి శివ్‌రాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, అధికారులు స్పాట్‌కు వెళ్లి పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ రోడ్డు ఇండోర్‌ నుంచి మహారాష్ట్రకు అనుసంధానంగా ఉంటుంది. ఇండోర్‌కు సుమారు 80 కిలోవిూటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సంజయ్‌ సేతు వంతెన ధార్‌`ఖర్‌గోన్‌ జిల్లాలకు మధ్య సరిహద్దుగా ఉంది. ఈ బ్రిడ్జిలో సగ భాగం ధార్‌ జిల్లాలో, మరో సగ భాగం ఖర్‌గోన్‌ జిల్లాలో ఉంది. ఖర్‌గోన్‌ కలెక్టర, ఎస్పీ స్పాట్‌కు చేరుకున్నారు. ఉదయం 9 నుంచి 9.15 సమయంలో ప్రయాణికులు బ్రేక్‌ఫాస్ట్‌, టీ నిమిత్తం ఇదే బస్సును డ్రైవర్‌ ఖాల్‌గాట్‌కు 12 కిలోవిూటర్ల దూరంలో ఉన్న ఒక హోటల్‌ దగ్గర పావు గంట సేపు ఆపినట్లు ఆ హోటల్‌ యజమాని తెలిపాడు. ఆ సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికుల్లో 12 నుంచి 15 మంది వరకూ బస్సు దిగి టీలు, టిఫిన్లు పూర్తి చేశారని మిగిలిన వారు బస్సులోనే కూర్చున్నారని చెప్పాడు. ఆ సమయంలో బస్సులో ఎంత మంది ఉన్నారో కచ్చితంగా చెప్పలేనని, కానీ 30 నుంచి 35 మంది వరకూ టిఫిన్‌కు దిగకుండా బస్సులోనే ఉండి ఉండవచ్చని చెప్పుకొచ్చాడు.