మధ్యప్రదేశ్ సీఎం ఆదర్శమా..!
` ఇదో పెద్ద జోక్:మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట,జనవరి 8(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నోరు పారేసుకున్న మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌పై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సిద్దిపేటలో హరీశ్‌రావు విూడియాతో మాట్లాడారు. దొడ్డిదారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి సీఎం అయిన చౌహాన్.. టీఆర్‌ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్‌ను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. శివరాజ్ సింగ్ మాటలు చూస్తుంటే.. వంద ఎలుకలు తిన్న పిల్లి తాను శాఖాహారి అన్నట్లు ఉందన్నారు. మధ్యప్రదేశ్‌కు నాలుగుసార్లు సీఎం అయిన కూడా ఆ రాష్ట్ర ప్రజలకు శివరాజ్ సింగ్ చేసిందేవిూ లేదన్నారు.అన్ని రంగాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. ఏ రంగంలో విూ రాష్ట్రం అభివృద్ధి సాధించిందని అడిగారు. కాళేళ్వరం ప్రాజెక్టును నిర్మించి రైతుల ముఖాల్లో సంతోషం చూస్తున్నామని తెలిపారు. పార్లమెంట్ సాక్షిగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదని ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు విూ కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. మధ్యప్రదేశ్‌లోని వ్యాపం కుంభకోణం సంగతి ఏంటి? అని ప్రశ్నించారు. ఎవరికైనా శిక్ష పడిరదా? అని అడిగారు.317 జీవో రద్దు చేయాలా.. అంటే రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయాలా? అని ప్రశ్నించారు. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలా వద్దా అని సూటిగా అడిగారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని సీఎం కేసీఆర్ భావిస్తుంటే, ఉద్యోగాలు రావొద్దని బీజేపీ కుట్ర చేస్తోందని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.