మనస్తాపంతో ఒకరి ఆత్మహత్య

కరీంనగర్‌, ఫిబ్రవరి 2 (): కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపానికి గురైన రవీందర్‌ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ధర్మపురి మండలం వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన మహేందర్‌ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆస్తుల విషయమై అన్నదమ్ముల మధ్య  తరుచూ వస్తున్న గొడవలతో వేసారిపోయి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్టు గ్రామస్థులు వివరించారు. శనివారం తెల్లవారుజామున ఇంటిలో ఎవ్వరూ లేని సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. శావాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.