మన్మోహన్‌ జీ ! తెలంగాణ ఇచ్చేయండి

తెలంగాణకు ఎన్‌సీపీ బాసట
ప్రధాని సానుకూలంగా స్పందించారు : శరద్‌పవార్‌
న్యూఢిల్లీ, జనవరి 31 (జనంసాక్షి) :
మన్మోహన్‌జీ తెలంగాణపై త్వరగా తేల్చాలని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌ పవార్‌ కోరారు. గురువారం ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో భేటీ అయిన ఆయన తెలంగాణ అంశంపై చర్చించారు. ప్రజలు కోరుకుంటున్నట్లుగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని, అందుకు తమ పార్టీ మద్దతునిస్తుందని తెలిపారు. యూపీఏ సమన్వయ కమిటీలో చర్చించి తెలంగాణ సమస్యను పరిష్కారించాలని ప్రధానికి పవార్‌ సూచించారు. తరవాత తనను కలసిన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ, సీమాంధ్రకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ ఉంటుందన్నారు. తరవాత సీమాంధ్రకు ప్రత్యేక రాజధాని ఏర్పాటవుతుందన్నారు. తెలంగాణ ఎప్పుడనే ప్రకటనపై చర్చ జరుగుతోందన్నారు. తెలంగాణ ఇస్తే అక్కడ కాంగ్రెస్‌ ఎక్కువ సీట్లు గెలిచే అవకావం ఉందన్నారు. తన కుమార్తెకు రాజకీయాల్లో చురుకైన స్థానం కల్పించి తాను రాజకీయాల నుంచి తప్పుకునే యోచనలో శరద్‌పవార్‌ తెలిపారు. గత 46 ఏళ్లుగా శరద్‌పవార్‌ రాజకీయాల్లో ఉన్నానని, యువతకు అవకాశం ఇవ్వాలనే యోచనతోనే తెలంగాణ ఏర్పాటుకు ఎన్సీపీ మద్దతిస్తుందన్నారు. తెలంగాణపై ఆలస్యం మంచిది కాదని తాను ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌కు చెప్పినట్లు తెలిపారు. తాను రాజకీయాల నుంచి కొద్దిరోజుల్లోనే నిష్కమ్రిస్తానని పవార్‌ చెప్పారు. ఇక గుడ్‌ బై చెప్పే సమయం వచ్చిందన్నారు. యువకులు రాజకీయాల్లోకి రావాలని ఆయన సూచించారు.
సానుకూలంగా స్పందించారు : వీహెచ్‌
తెలంగాణపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ¬ంమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండేను కోరానని, ఆయన సానుకూలంగా స్పందించారని రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు అన్నారు. లగడపాటిపై చర్యలు తీసుకోవాలి డిమాండ్‌ చేశారు. పిసిసి చీఫ్‌ బొత్స సత్యనారాయణ ఓ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతీశారంటు పిసిసి ఉపాధ్యక్షుడు ఇంద్రసేనా రెడ్డి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు.

తాజావార్తలు