మన్మోహన్‌ మంత్రి వర్గంలో కొత్త కొలువులు

22 మంది ప్రమాణ స్వీకారం
మన రాష్ట్రనికి చెందిన 5గురు మంత్రులు
న్యూఢిల్లీ, అక్టోబర్‌ 28: కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఆదివారం ఉదయం 11-30 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో మొత్తం 22 మంది ప్రమాణం చేశారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ వారితో ప్రమాణం చేయించారు. ఇందులో ఏడుగురుకి కేబినెట్‌ హోదా, ఇద్దరు స్వతంత్రహోదా, మిగిలినవారు సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. ముందుగా కర్నాటకకు చెందిన రాజ్యసభ రెహ్మన్‌ ఖాన్‌తో ఈ కార్యక్రమం ప్రారంభమయింది.
కాగా ఇప్పటికే రాష్ట్రానికి చెందిన ఐదుగురు కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తుండగా మరో ఐదుగురు చిరంజీవి, సర్వే సత్యనారాయణ, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, కిల్లి కృపారాణి, బలరాం నాయక్‌లు ఈ రోజు కొత్తగా ప్రమాణం చేశారు. పాత మంత్రుల్లో కొందరికి శాఖలను మార్పు చేశారు.కేటాయింపు వివారాలు..
కేబినెట్‌ మంత్రులు
కేబినెట్‌ మంత్రులుగా రెహ్మన్‌ఖాన్‌-మైనార్టీ సంక్షేమ శాఖ
దిన్షాపటేల్‌-గనుల శాఖ
అజయ్‌ మాకెన్‌-గృహ నిర్మాణ శాఖ
పళ్లం రాజు – మానవ వనరుల అభివృద్ధి శాఖ
ఆశ్వినీరావత్‌ – జలవనరుల శాఖ
హరీష్‌రావత్‌ – జలవనరుల శాఖ
చంద్రేశ్‌కుమారీ కటోజ్‌ – సాంస్కృతిక శాఖ
స్వతంత్ర ప్రతిపత్తి గల సహాయ మంత్రులు
మనీష్‌ తివారీ – సమాచార శాఖ (స్వతంత్ర హోదా)
చిరంజీవి- పర్యాటక శాఖ (స్వతంత్ర హోదా)

సహాయ మంత్రులుగా
శశి థరూరు – మానవ వనరుల అభివృద్ధి సహాయ మంత్రి
కె. సురేశ్‌ – లేబర్‌ శాఖ సహాయ మంత్రి
తరీఖ్‌ అన్వార్‌ – వ్యవసాయ సహాయ మంత్రి
రాణి నారా – గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి
అంధీర్‌ రంజన్‌ చౌదరీ – రైల్వే శాఖ సహాయ మంత్రి
ఏహెచ్‌ ఖాన్‌ చౌదరి – వైద్య, ఆరోగ్య శాఖ సహాయ మంత్రి
సర్వే సత్యనారాయణ – రోడ్డు, రవాణా శాఖ సహాయ మంత్రి
నినాంగ్‌ ఎరింగ్‌ – మైనార్టీ శాఖ సహాయ మంత్రి
దీపా దాస్‌మున్షీ – గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి
బలరాం నాయక్‌ – సామాజిక శాఖ సహాయ మంత్రి
కిల్లి కృపారాణి – ఐటీ శాఖ సహాయ మంత్రి
లాల్‌చంద్‌ ఖటారాయా – రక్షణ శాఖ సహాయ మంత్రి
వీరప్ప మెయిలీ – పెట్రోలియం శాఖ