మన ఊరు మనబడి పనులను త్వరగతిన పూర్తి చేయాలి
-కలెక్టర్ కె శశాంక
మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్21(జనంసాక్షి)
మన ఊరు మనబడి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశం మందిరంలో విద్యాశాఖ, ఇంజనీరింగ్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కొత్తగూడ ,గంగారం, మహబూబాబాద్, బయ్యారం మండలాల్లో గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం ద్వారా జరుగుతున్న మన ఊరు మనబడి అభివృద్ధి పనుల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే గుర్తించిన పాఠశాలలో మన ఊరు మనబడి కింద చేపట్టి ఇంకను మిగిలి ఉన్న పనులను సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పాఠశాలలో మన ఊరు మనబడి కింద తీసుకున్న పనుల్లో భాగంగా మేజర్ మైనర్ మరమ్మతులు, విద్యుదీకరణ, త్రాగునీటి వసతి, శిథిలావస్థలో ఉన్న తరగతి గదులకు బదులుగా అదనపు తరగతి గదుల ఏర్పాటు, ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా చేపడుతున్న టాయిలెట్స్ వంట గదుల ఏర్పాటు పనులను త్వరగా పూర్తిచేసి వినియోగం తేవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పూర్తిచేసిన పనులను, ఇంక నూ పూర్తి కావాల్సిన వాటిని విద్య శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ ఇంజనీరింగ్ అధికారుల సమన్వయంతో పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ హై గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగపు అధికారులు ఆయా మండలాల అధికారులు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.