మన ఊరు మన బడి నిర్మాణ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్

ప్రాథమికోన్నత పాఠశాల గాంధీ పార్క్ మన ఊరు మన బడి పనులను మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ పరిశీలించారు.. సామాజిక మాధ్యమంలో “మూత్రశాలలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు” అనే అంశంపై మండల విద్యాధికారి ఎం బాలాజీ నాయక్ తో సందర్శించి నిర్మాణం అవుతున్న మూత్రశాలలను పరిశీలించి వారంలోపు పూర్తి చేయుటకు కాంట్రాక్టర్ శంకర్ ను ఆదేశించారు. వంటగది, తరగతి నిర్మాణాలను పరిశీలించి నాణ్యత ప్రమాణాలు పాటించాలని పనులు వేగంగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల నుండి హాస్టల్లో నివాసం పొందుతూ ఈ పాఠశాలలో విద్యార్థులు చేరుతున్నారని పేద విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించుటకు తెలంగాణ ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఒక మాసంలోపు పనులు మొత్తం పూర్తి చేసి ప్రారంభించుకునేలా ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఉపాధ్యాయులు విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగు పడుచుటకు ఆధునిక బోధనా పద్ధతులు అవలంబించాలని కోరారు. పాఠశాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అవసరమైతే అదనపు నిధులు మంజూరు చేయుటకు సహకరిస్తానని తెలిపారు. వారి వెంట మండల విద్యాధికారి యం బాలాజీ నాయక్, ప్రధానోపాధ్యాయులు ఏ కురువ, కాంట్రాక్టర్ శంకర్ నాయక్, కౌన్సిలర్ ఖాదర్, రామ్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

తాజావార్తలు