మరణశిక్ష రద్దుకు భారత్‌ వ్యతిరేక ఓటు

ఐక్యరాజ్య సమితి (ఏజెన్సీస్‌) : ప్రపంచ వ్యాప్తంగా మరణ శిక్షను నిషేదిస్తూ ఐక్యరాజ్య సమితి సాదారణ సభలో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మాణానికి వ్యతిరేకంగా ఓటు వేసిన 39 దేశాల్లో భారతదేశం కూడా ఉంది. ప్రతి దేశానికి తన స్వంత న్యాయ వ్యవస్థను రూపోందించుకునే సార్వభౌమాధికారం ఉందని పేర్కోంది.ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో సామాజిక మానవ సంబంధ అంశాలను పర్యవేక్షించే మూడవ కమీటి ప్రవేశపెట్టిన ఈ తీర్మాణానికి 110దేశాలు అనుకూలంగా ఓటు వేయగా, 36 దేశాల ప్రతినిధులు గైర్హాజరయ్యారు. భారత్‌తో పాటు అమెరికా, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌,చైనా, కోరియా, ఇరాన్‌, ఇరాక్‌, జపాన్‌, కువైట్‌, లిబియా దేశాలు కూడా ఈ తీర్మాణానాన్ని వ్యతిరేకించారు.

ఇప్పటికి కోనసాగుతున్న మరణశిక్షపై తీవ్ర అందోళన వ్యక్తం చేస్తూ, ఈ నినాదాన్ని పూర్తిగా రద్దు చేసే దిశగా మారటోరియం విధించాలని, ముఖ్యంగా 18 సంవత్సరాల లోపు వారికి, గర్భిణి స్త్రీలకు మరణ శిక్షలు విధించరాదని, మరణ శిక్షలను గణనీయంగా పరిమితం చేయాలని అయా దేశాల ప్రభుత్వాలకు ఈ ముసాయిదా తీర్మానం పిలుపునిచ్చింది. అదే సమయంలో మరణశిక్షకు దారితీసేంతటి నేరాలు జరుగకుండా అదుపు చేయాలని కూడా ఈ తీర్యాణం పిలుపునిచ్చింది.ఈ తీర్మానంపై ఓటింగ్‌ సందర్బంగా భారత ప్రతినిధి మాట్లాడుతూ భారత్‌లో అత్యంత అరుదైన సంధర్బాలలో మాత్రమే మరణశిక్ష విదింపు జరుగుతున్నదని పేర్కోన్నారు. ఈ తీర్మాణంలో ఉన్న ప్రస్తుత రూపంలోని పాఠానికి భారత్‌ మద్దతు ఇవ్వజాలదన్నారు. గర్బిణి స్త్రీలకు మరణశిక్ష విదింపును సస్పెండ్‌ చేసేలా భారతదేశ చట్టాల్లో నిబందనలున్నాయని ఓటింగ్‌పై చర్చ సందర్భంగా తెలిపారు. భారత్‌లో మరణశిక్షలను సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్ళే వెసులుబాటు ఉన్నదని వివరించారు.