మరమగ్గ కార్మికులకు వేతనాలు పెంచాలి

కరీంనగర్‌, నవంబర్‌ 27 : సిరిసిల్ల పట్టణంలో మరమగ్గ కార్మికులకు వేతనాలను పెంచాలంటూ మంగళవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం వారు రిలేనిరాహారదీక్షలు చేపట్టారు. గత కొంతకాలంగా తమకు వేతనాలు పెంచుతామని యాజమాన్యాలు ఊరిస్తున్నదే తప్ప నేటివరకు జీతాలు పెంచలేదని ఆగ్రహంవ్యక్తం చేశారు. ప్రస్తుతం పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా తమ జీతాలు సరిపోవడంలేదని, ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి రాత్రివరకు విధులు నిర్వహిస్తున్నామని, మరమగ్గాలలో విధులు నిర్వహించడమే తప్ప మరే ఇతర పనులు చేయలేనిస్థితిలో ఉన్నామని అన్నారు. వెంటనే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా తమ జీతాలు కూడా పెంచాలని వారు కోరారు.