మరాఠా మహాయోధుడు శివాజీ
నేడు శివాజీ జయంతి
ముంబై,ఫిబ్రవరి18 ( జనం సాక్షి): భారత చరిత్రలో శివాజీకి ఉన్న ఘనత మరే రాజుకు లేదనడంలో అతిశయోక్తి లేదు. విదేశీ దుండగుల దాడులను తట్టుకుని మరఠ్వాడాను నిలిపిన మహామోధుడాయన.
శివాజీ క్రీ.శ. 1630 ఫిబ్రవరి 19వ సంవత్సరం వైశాఖమాసపు శుక్లపక్ష తదియనాడు పూణెళి జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో షాహాజీ, జిజియాబాయి దంపతులకు జన్మించాడు. వీరు మహారాష్ట్రలోని వ్యవసాయం చేసుకునే భోస్లే కులానికి చందినవారు. శివాజీ తల్లి జిజియాబాయి యాదవ క్షత్రియ వంశమునకు చెందిన ఆడ పడుచు. శివాజీకి ముందు పుట్టిన అందరూ మృతి చెందగా ఆమె పూజించే దేవత అయిన శివై పార్వతి పేరు శివాజీకు పెట్టింది. శివాజీ తల్లి అతనికి పుట్టిన భూమి పైన, ప్రజల పైన ప్రేమ కలుగునట్లు విద్యాబుద్ధులు నేర్పింది. చిన్నప్పటినుండి భారత రామాయణ బలి చక్రవర్తి గాథలు చెప్పి వీర లక్షణాలు మొలకింప చేసింది. పరమత సహనం, స్త్రీల పట్ల గౌరవం తన తల్లివద్దనే నేర్చుకున్నాడు. తన తండ్రి పొందిన పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతి కాలంలో శివాజీ యుద్ధ తంత్రాలలో నిష్ణాతుడయ్యాడు. సకల విద్యలు తెలుసుకొన్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనే
లక్ష్యంగా తన వ్యూహాలు మొదలు పెట్టాడు. 17 ఏళ్ళ వయసులో శివాజీ మొట్టమొదటి యుద్ధం చేసి బిజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు. మరో మూడేళ్ళలో కొండన, రాజ్‌ఘడ్ కోటలను సొంతం చేసుకొని పూణెళి ప్రాంతాన్నంతా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు.
1666లో ఔరంగజేబు తన యాభయ్యవ పుట్టినరోజు సందర్భంగా శివాజీని, అతని ఆరేళ్ళ కొడుకు శంభాజీని ఆగ్రాకు అహ్వానించాడు. సభలో శివాజీని సైనికాధికారుల వెనుక నిలబెట్టి అవమానపరిచాడు. ఇది సహించలేని శివాజీ బయట వెళ్తుండగా భటులు చుట్టుముట్టి శివాజీ ఉంటున్న అతిథి గృహానికి తీసుకెళ్ళి
అక్కడే బందీ చేశారు. ఆ తరవాత అక్కడి నుంచి మారువేశంలో తప్పించుకున్నాడు. ఇలా మొగులలను ముప్పు తిప్పలుపెట్టి స్వదేశం కోసం నిరంతరంగగా శ్రమించిన యుద్దవీరుడు శివాజీ.
““““““`