మరిన్ని విద్యా సంస్థలకూ.. విశిష్ట   హోదా ఇస్తాం

– పార్లమెంట్‌లో స్పష్టం చేసిన కేంద్రమంత్రి జవదేకర్‌
న్యూఢిల్లీ, జులై23(జ‌నంసాక్షి) : యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ)ను సంస్కరించాల్సిన అవసరం చాలా ఉందని కేంద్ర మంత్రి జవదేకర్‌ తెలిపారు. సోమవారం లోక్‌సభలో ఆయన ఈ అంశం గురించి మాట్లాడారు. దశాబ్ధాలుగా ఉన్నత విద్య మారుతోందని, ఈ నేపథ్యంలో యూజీసీని కూడా మార్చాల్సి వస్తుందని ఆయన అన్నారు. యూజీసీని రద్దు చేసి హైయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియాను ఎందుకు ప్రవేశపెడుతున్నారని తృణామూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ సుగతా బోస్‌ ప్రశ్నించారు. యూజీసీ కన్నా తక్కువ అధికారాలు ఉన్న హెచ్‌ఈసీఐతో ఉపయోగం ఏమి ఉంటుందని ఆయన అడిగారు. కొన్ని విద్యా సంస్థలకు విశిష్ట ¬దాను ఎందుకు ఇస్తున్నారని సుగతా బోస్‌ ప్రశ్నించారు. అయితే విశిష్ట ¬దా ఇవ్వడం అనేది నిరంతర పక్రియ అని, మునుముందు మరికొన్ని సంస్థలకు కూడా ఆ ¬దాను ఇస్తామని మంత్రి తెలిపారు. హెచ్‌ఈసీఐను తీసుకురావడం కంటే యూజీసీని ఎందుకు పటిష్టం చేయడం లేదని అన్నాడీఎంకే సభ్యుడు, డిప్యూటీ స్పీకర్‌ ఎం తంబిదురై మంత్రిని ప్రశ్నించారు. ఉన్నత విద్యను సంస్కరించాలన్న ఐడియా యూపీఏ ప్రభుత్వం చేసిందని, కానీ ఎన్డీఏ ఆ ఐడియాను కాపీ కొట్టిందన్నారు. ఇది కొత్త సీసాలో పాత సారా అన్నట్టుగా ఉందన్నారు. అయితే దీనిపై మంత్రి జవదేకర్‌ స్పందిస్తూ.. ఈ బిల్లు యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దానికంటే భిన్నమైందన్నారు. ఫండింగ్‌ పద్ధతిని మార్చేస్తున్నామన్నారు. విద్యా వ్యవస్థ సంస్కరణకు తీసుకువస్తున్న కొత్త బిల్లు సమాఖ్యా వ్యవస్థకు వ్యతిరేకమైందని అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు. అయితే రాష్ట్రాల హక్కులను తగ్గించడంలేదని, రిజర్వేషన్‌ వ్యవస్థలో ఎటువంటి మార్పు ఉండదని మంత్రి స్పష్టం చేశారు.