మరోమారు కాపుల నిరసన
జగన్ పాదయాత్రలో ప్లకార్డులతో ప్రదర్శన
కాకినాడ,జూలై31(జనం సాక్షి ): కాపు రిజర్వేషన్ల విషయంలో తానేవిూ చేయలేనని అన్న వైసీపీ అధినేత జగన్‌పై ఆ సామాజిక వర్గం నుంచి తీవ్ర నిరసనలు ఎదురవుతున్నాయి. రెండు రోజుల కిందట పాదయాత్రలో జగన్‌ను అడ్డుకున్న కాపు ప్రజలు మంగళవారం కూడా మరోమారు జగన్ ముందు తమ ఆందోళనను వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం ఎఫ్.కె పాలెం గ్రామంలో జగన్‌కుకాపు సెగ తగిలింది. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ కాపు ప్రజలు, నాయకులు జగన్‌కు నిరసన తెలిపారు. కాపు రిజర్వేషన్లకు మద్దతుగా నిలబడి పోరాడాలని డిమాండ్ చేశారు. కాపు రిజర్వేషన్ల విషయంలో జగన్ వైఖరిలో మార్పు రాకపోతే ఆయనకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కాపు నాయకులు స్పష్టం చేశారు. కాపుల ఆందోళన చూస్తూ ఉంటే జగన్ తూర్పుగోదావరి జిల్లాలో యాత్ర ముగించే వరకు ఆ సామాజిక వర్గం నుంచి నిరసనలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి 225వ రోజు ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభమైంది. జగన్ తన 225వ రోజు పాదయాత్రను విరవ శివారు నుంచి ప్రారంభించారు. పాదయాత్ర విరవాడ, ఎఫ్‌కే పాలెం, కుమారపురం విూదుగా పిఠాపురం వరకు కొనసాగనుంది. పాదయాత్రలో భాగంగా సాయంత్రం పిఠాపురంలో జరిగే బహిరంగ సభలో జగన్ పాల్గొని ప్రసంగించనున్నారు.
—