మరోమారు పెరిగిన కరోనా కేసుల సంఖ్య
20వేల సంఖ్యను దాటిన పాజిటివ్ కేసులు
న్యూఢల్లీి,జూలై14(జనం సాక్షి): దేశంలో ఇన్నాళ్లు 20 వేలకు లోపు నమోదు అవుతూ వచ్చిన కేసుల సంఖ్య తాజాగా 20 వేలను దాటింది. దేశంలో అన్ని రాష్టాల్ల్రోనూ కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. మహారాష్ట్రతో పాటు వెస్ట్ బెంగాల్, కేరళ, కర్ణాటక రాష్టాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 20,139 కేసులు నమోదు అయ్యాయి. 38 మంది కోవిడ్ బారినపడి మరణించారు. 16,482 మంది కోవిడ్ బారి నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,36,076కు చేరింది. పాజిటివిటీ రేటు ప్రస్తుతం 5.10 శాతానికి చేరింది. దాదాపుగా కొన్ని నెలల తర్వాత తొలిసారిగా ఇండియాలో కేసుల సంఖ్య
20 వేలను దాటింది. దేశవ్యాప్తంగా కరోనా వల్ల ఇప్పటి వరకు 5,25,557 మంది మరణించగా, 4,30,28,356 మంది కోవిడ్ బారిన పడి మళ్లీ రికవరీ అయ్యారు. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ పక్రియ వేగవంతంగా సాగుతోంది. ఇప్పటి వరకు ఇండియాలో అర్హులైన వారికి 199,27,27,559 డోసుల వ్యాక్సినేషన్ అందించింది. బుధవారం ఒక్కరోజే దేశంలో 13,44,714 మందికి టీకా ఇచ్చారు.