మరోసారి ఫైరింగ్ కు దిగిన పాకిస్థాన్
భారత్ ఎంతగా హెచ్చరించినప్పటికీ పాకిస్థాన్ బుద్ధి మారటం లేదు. కాల్పులు విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ బరితెగిస్తూనే ఉంది. తాజాగా ఆర్.ఎస్ పురా సెక్టార్ లో మరోసారి ఫైరింగ్ కు దిగింది. గ్రేనైడ్ లతో సమీప గ్రామాల ప్రజలపై పాక్ ఆర్మీ ప్రతాపం చూపింది. గ్రామస్తులనే టార్గెట్ చేసి ఈ దాడికి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు గ్రామస్తులు మృతి చెందారు. దాదాపు 22 మంది గాయపడ్డారు. గాయపడిన వారందరినీ సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటన గురించి తెలిసిన వెంటనే ఆర్మీ అప్రమత్తమైంది. పాక్ బలగాలను నియంత్రించింది. సరిహద్దు గ్రామాల ప్రజలను పాక్ పదే పదే టార్గెట్ చేయటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అటు పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న ప్రభుత్వం ఏం చేస్తుందని కాంగ్రెస్ ప్రశ్నించింది