మరో అద్భుతాన్ని సృష్టించిన చైనా

chainaబీజింగ్: అత్యంత గరిష్ట ఉష్ణోగ్రతనూ తట్టుకొనే ఓ అద్భుతమైన మెటీరియల్‌ను చైనా సృష్టించింది. ఇప్పటిదాకా తయారు చేసిన లోహాల్లో ఎక్కువ ఉష్ణోగ్రతను తట్టుకొనే లోహమిదేనని ఏరోస్పేస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ మెటీరియల్ అండ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ సీనియర్ ఇంజనీర్ జు జంగ్‌ఫెంగ్ తెలిపారు. అంతరిక్షంలోకి పంపే రాకెట్‌లు, స్పేస్‌క్రాఫ్ట్‌లు, శాటిలైట్ల తయారీలో ఈ లోహాన్ని వినియోగించవచ్చని చెప్పారు.

అంతరిక్ష పరిశోధనల్లో అగ్రగామి దేశాలుగా చెప్పుకుంటున్న అమెరికా, రష్యా మరికొన్ని ఐరోపా దేశాలు రాకెట్ల తయారీ కోసం ఏరోజెల్ మెటీరియల్‌ను ఉపయోగిస్తున్నాయని, దానికి మించి ఉష్ణోగ్రతను తట్టుకునే శక్తి తాము రూపొందించిన లోహానికి ఉందన్నారు. ఏరోజెల్‌ను సైతం తమ సంస్థే తయారు చేసిందని, అన్ని దేశాలూ ఇప్పుడు ఏరోజెల్‌నే ఉపయోగిస్తున్నాయన్నారు. కొత్తగా తాము తయారుచేసిన లోహం కేవలం ఉష్ణోగ్రతనే కాకుండా భారీ వైబ్రేషన్‌ను సైతం తట్టుకుంటుందని జంగ్‌ఫెంగ్ చెప్పారు.