మరో రికార్డు సాధించిన ధోనీ
హరారే : చిట్టచివరి బంతికి అత్యంత కష్టమ్మీద గెలిచి, జింబాబ్వే చేతిలో పరువు పోగొట్టుకోకుండా బయటపడిన టీమిండియా విజయసారథి మహేంద్రసింగ్ ధోనీ మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు ఏ ఫార్మాట్లో అయినా టీమిండియాకు మొత్తం 324 విజయాలు సాధించి, ఆస్ట్రేలియా ఆల్ టైం గ్రేట్ రికీ పాంటింగ్ రికార్డును సమం చేశాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్లో బుధవారం జరిగిన టి20 మ‍్యాచ్ విజయంతో ధోనీ ఈ మైలురాయిని చేరుకున్నాడు.
2007లో టీమిండియాకు కెప్టెన్ అయిన ధోనీ ఇప్పటివరకు 60 టెస్టులు, 194 వన్డేలు, 70 టి20 మ్యాచ్లలో భారతజట్టుకు సారథ్యం వహించాడు. భారతజట్టు కెప్టెన్లు అందరిలోనూ విజయాల శాతం ఎక్కువగా ఉన్నది కూడా ధోనీకే. 27 టెస్టులు, 107 వన్డేలు, 40 టి20లలో విజయాలను అందించాడు. ఈ తొమ్మిదేళ్లలో టి20 ప్రపంచ కప్, ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీలను అందించడంతో పాటు ఐసీసీ టెస్టు ర్యాంకింగులలో జట్టును అగ్రస్థానంలో నిలిపాడు. 2014లోనే టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అయిన ధోనీ, ప్రస్తుతం వన్డేలు, టి20లలో జట్టుకు సారథ్యం వహిస్తూ వికెట్ కీపర్గా సేవలు అందిస్తున్నాడు.