మల్కాపూర్ స్వైన్‌ప్లూతో మహిళ మృతి
స్టేషన్‌ఘన్‌పూర్: మండలంలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన అనూష(25)అనే మహిళ స్వైన్‌ప్లూతో గురువారం మృతి చెందినది. కొంత కాలంగా ఆమె స్వైన్‌ప్లూతో బాధపడుతుండటంతో హైదరాబాద్ డసోమాజీగూడలోని ఒక కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె తొమ్మిది నెలల గర్భిణి కావటంతో శస్త్ర చికిత్స చేసి బిడ్డను బయటకు తీశారు. చికిత్స నిమిత్తం బిడ్డను హైదరాబాద్‌లోని పిల్లల ఆసుపత్రిలో చేర్పించారు.