మల్లన్న సేవలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి
శ్రీశైలం,సెప్టెంబర్1(జనం సాక్షి): శ్రీశైల భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి వార్లను శనివారం ఉదయం సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ దంపతులు దర్శించుకున్నారు. దర్శనార్థం వచ్చిన న్యాయమూర్తి దంపతులకు ఆలయ మహాద్వారం వద్ద కర్నూలు జిల్లా ప్రధాన జడ్జీ అనుపమ చక్రవర్తి, ఎఎస్పీ మాధవ రెడ్డి, దేవస్థానం ఈవో శ్రీరామ చంద్రమూర్తి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. న్యాయమూర్తి దంపతులు మహా మంగళహారతి సేవలో పాల్గొని స్వామి వారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించుకున్నారు. వేద పండితులు ఆశీర్వాచనలు పలకగా దేవస్థానం ఈవో న్యాయమూర్తి దంపతులకు స్వామి వార్ల శేషావస్త్రం, జ్ఞాపిక అందజేశారు.