మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి – ఎంపీపీ.
కూసుమంచి ఆగస్టు 10 ( జనం సాక్షి ) : మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని మన యొక్క లక్ష్యం చేరేంతవరకు నిత్యం శ్రమించాలని మండల పరిషత్ అధ్యక్షులు బానోతు శ్రీనివాస్ అన్నారు. స్వాతంత్ర్య వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం రోజున కూసుమంచి ఉన్నత పాఠశాలలో వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు మొక్కలు చేత బూని స్వాతంత్ర వచ్చి 75 సంవత్సరాలు అయినందున 75 అక్షర మాలిక రూపంలో కూర్చొని తమ జాతీయతను చాటుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఎంపీపీ మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగ ఫలితమే మనము అనుభవిస్తున్న స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈనెల 8వ తేదీ నుండి 22వ తేదీ వరకు దేశం మొత్తం కూడా వజ్రోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా తెలంగాణలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 8వ తేదీన వజ్రోత్సవాల ను ప్రారంభ కార్యక్రమం చేశారని ఆయన పిలుపునందుకొని మనమందరం కూడా జాతీయ సమైక్యతను చాటుకోవాలని ఆయన కోరారు మహనీయుల యొక్క జీవిత గాథలను ఆదర్శంగా తీసుకొని శ్రమించాలని జాతి, మత, కుల వివక్షత లేకుండా ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా రెపరెపలాడాలని అహింస ఆయుధంగా స్వాతంత్ర్య పోరాటం చేసిన మహనీయుడు మహాత్మా గాంధీ యొక్క సినిమాను అన్ని థియేటర్లలో ప్రదర్శిస్తున్నారని కావున విద్యార్థులు అందరూ తిలకించి వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి చైర్మన్ ఎస్.కె మైము, కూసుమంచి సర్పంచ్ చెన్నా మోహన్, సీఐ సతీష్, మండల అభివృద్ధి అధికారి కరుణాకర్ రెడ్డి, ఎస్సై యాసా నందీప్, ఎంపీ ఓ రామచంద్రరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రేలా విక్రం రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.